Monday, September 17, 2018

#మనిషి

206 ఎముకలు, 640 కండరాలు
23 జతల క్రోమోజోములు
రెండు కాళ్లు, రెండు చేతులు, రెండే కళ్ళు
రెండు నాసిక రంధ్రాలు, రెండు చక్షువులు, రెండే పెదవులు
ఏ కులమైనా, ఏ మతమైనా, రంగేదైనా చర్మం ఒకటే..
20 ధమనులు, లక్ష మైళ్ళ పొడవున్న సిరలున్నా,

నరికితే పెల్లుబికే రక్తం ఒకటే..
సృష్టికి మనుషుల్లో తేడా లేదు.
మనుషుల సృష్టిలోనే తేడాలన్నీ..

                                                   - మధు

Sunday, January 21, 2018

క్షణం

నిమిషం నిమిషం నివురై పోయే..
నీకై  నిరీక్షణలో...
నిప్పై  నన్ను కాల్చే..
నీ  ఎడబాటులో...
కలిసి ఉండే  క్షణం కోసమే..
నే కలవరిస్తున్నా...
నిన్ను నన్ను  కలిపి ఉంచే  ఆ క్షణానికే  ఋణపడుతున్నా... 
- మధు

Monday, May 8, 2017

రోబోసేపియన్స్

రక్తమాంసాలున్న  రోబోలం !
ఎవరో  అరువిచ్చిన  Artifical Intelligance ని  వాడడమే తప్ప..  
సొంతంగా  ఆలోచించడం  మానేసిన  మనుషులం... 

ఎవరైనా  రండి …! 
మా  neural schema ని  మార్చి  మమ్ముద్దరించండి..
మనిషికి , machine కి  తేడా  చూడగలిగే  లోకానికి  దారి  చూపండి..
ఈ  materialistic world లో  humanity కీ  కాస్తంత  చోటుందని  నిరూపించండి...
ఎవరైనా  ముందుకు  రండి …! 
- మధు  March 25, 2015

నేను

కోపమొస్తుంది.. 
నన్నెవరో  నా నుండి  లాగేయాలని  చూస్తున్నపుడు... 
భయమేస్తుంది..  
నన్ను  నేను  కోల్పోతానేమో  అని అనుమానమొచ్చినపుడు... 
బాదేస్తుంది.. 
నన్ను  నేను  పోగొట్టుకున్నపుడు... 
ఆశ్చర్యమేస్తుంది.. 
నాలో  నేను  లేనని  తెలిసినపుడు... 
ఆరాటంగా  ఉంటుంది..  
నన్ను  నేను  తిరిగి  పొందాలనుకున్నపుడు... 
ఆనందమేస్తుంది..  
నాకు  నేను  దొరికినపుడు... 
గర్వంగా  ఉంటుంది.. 
నన్ను  నేను  గెలుపొందినపుడు... 
నవ్వొస్తుంది... 
నేను  అనేది  ఒక  'మిధ్య'  అని  తెలిసినపుడు :O 
 - మధు  Jan 2,  2015

Sunday, May 7, 2017

My valentine in imagination.. ‪#‎ఆమె‬#

శిశిరం దాటిన వసంతంలా...
వసంతంలో చిగురించిన కొమ్మలా...
కొమ్మ ఊగినపుడు వీచిన పవనంలా...
పవనపు చల్లదనానికి కరిగిన మేఘంలా...
మేఘం కరిగి కురిసిన వానలా...
వానలో తడిసిన భామలా...
భామ ముక్కుకున్న పుడకలా...
పుడక మెరిసిన మెరుపులా...
ఆ మెరుపులో కనిపించిన ఆమె మోములా...
మోముపై నర్తించే ముంగురులలా...
ముంగురులను సవరించే ముని వ్రేళ్ళలా...
వ్రేలికున్న ఉంగరంలా...
ఉంగరంలోని పగడంలా...
పగడపు కాంతి ప్రతిబింబించిన ఆమె పలువరుసలా...
పలువరుసను ముద్దాడుతున్న ఆమె పెదాలలా...
ఆ పెదాలు పలికే నా పేరులా... 
ఎంత అందంగా ఉంది 
- మధు
— feeling wonderful.

బ్రతుకు

బయలుదేరా బతుకుదెరువు కోసం..
బాదల బందీఖానా నుండి బయటపడటం కోసం...

బంధాలను కాలదన్ని పోయిన కరకు మనుషుల నుండి దూరంగా..
నన్ను నేను వెతుక్కుంటూ నాలోకి నన్ను జొప్పిస్తూ కదులుతున్నా భారంగా...

ఉన్న ఊరు ఖాళీ చేసి కొత్త ఊరికి వలసపోతున్నా..
మరి ఖాళీ ఐన మనసు గతి ఏమిటన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తున్నా...

- మధు
Feb 4, 2017

Thursday, September 8, 2016

# పది

 అమ్మ  ఎపుడూ  చెప్తూ ఉండేది..
 'మంచోడ్ని  పది  ఇచ్చి  కొనుక్కో,
 చెడ్డోడ్ని  పది  ఇచ్చి  వదిలించుకో నాన్నా' అని....
 ఇప్పటికి  ఎన్నో  పదులు  వాడాను.
 ఏ పది  దేనికి వాడానన్నదే  అర్ధమయ్యి సావట్లేదు..
 నా దగ్గర  ఇంకా  చాలా  పదులున్నాయి..
 వాటిని  వాడాలా ? వద్దా !?


 - మధు
 సెప్టెంబర్ 2, 2016