కోపమొస్తుంది.. |
నన్నెవరో నా నుండి లాగేయాలని చూస్తున్నపుడు... |
భయమేస్తుంది.. |
నన్ను నేను కోల్పోతానేమో అని అనుమానమొచ్చినపుడు... |
బాదేస్తుంది.. |
నన్ను నేను పోగొట్టుకున్నపుడు... |
ఆశ్చర్యమేస్తుంది.. |
నాలో నేను లేనని తెలిసినపుడు... |
ఆరాటంగా ఉంటుంది.. |
నన్ను నేను తిరిగి పొందాలనుకున్నపుడు... |
ఆనందమేస్తుంది.. |
నాకు నేను దొరికినపుడు... |
గర్వంగా ఉంటుంది.. |
నన్ను నేను గెలుపొందినపుడు... |
నవ్వొస్తుంది... |
నేను అనేది ఒక 'మిధ్య' అని తెలిసినపుడు :O |
- మధు Jan 2, 2015 |
No comments:
Post a Comment