శిశిరం దాటిన వసంతంలా...
వసంతంలో చిగురించిన కొమ్మలా...
కొమ్మ ఊగినపుడు వీచిన పవనంలా...పవనపు చల్లదనానికి కరిగిన మేఘంలా...
మేఘం కరిగి కురిసిన వానలా...
వానలో తడిసిన భామలా...
భామ ముక్కుకున్న పుడకలా...
పుడక మెరిసిన మెరుపులా...
ఆ మెరుపులో కనిపించిన ఆమె మోములా...
మోముపై నర్తించే ముంగురులలా...
ముంగురులను సవరించే ముని వ్రేళ్ళలా...
వ్రేలికున్న ఉంగరంలా...
ఉంగరంలోని పగడంలా...
పగడపు కాంతి ప్రతిబింబించిన ఆమె పలువరుసలా...
పలువరుసను ముద్దాడుతున్న ఆమె పెదాలలా...
ఆ పెదాలు పలికే నా పేరులా...
ఎంత అందంగా ఉంది
- మధు
No comments:
Post a Comment