Tuesday, December 31, 2013

స్నేహం

 కవిత్వమంటే... ? 

 ప్రాస కోసం ప్రయాస.. 



 ప్రేమంటే...? 

 తన కోసం తపన.. 


 అందమంటే...? 

 చెలి ఎరుపెక్కిన చెక్కిలి..  


 స్నేహమంటే...? 

 ... ప్రాణం పోయేవరకు సాగే ప్రయాణం.. 


 - మధు 

 (On behalf of 'Friendship day')


'జీవితం' vs 'గొప్ప జీవితం'

గిన్నెడు  గోరుముద్దలు.. గడికిన్ని  ముద్దులు. 
చారెడు  బలపాలు.. బోలెడు  అల్లర్లు.
సంచెడు  పుస్తకాలు.. బండెడు  జ్ఞాపకాలు.
మూడు  ముళ్ళు.. ఏడు  అడుగులు...  
గుప్పెడు  అక్షతలు.. దోసెడు  తలంబ్రాలు. 
ఆకాశమంత  ఆశలు.. నక్షత్రాలన్ని  కోరికలు.
అంతులేని  అనుభూతులు.. అపుడపుడు  జాలువారే ఆనంద బాష్పాలు. 
వేలల్లో  తెలిసిన వాళ్ళు.. వేళ్ళమీద  లెక్కపెట్టుకునేంత మంది  ఆప్తులు. 
కడివెడు  కన్నీళ్ళు.. కొండంత  సంతోషాలు.
ఆఖరికి, 
ఆరడుగుల  నేల.. పిడికెడు  మట్టి.
జీవితంలో  అన్నింటికి  కొలతలున్నాయి.. అది  కాదు  గొప్ప.
మన జీవితమే  ఒక  'కొలబద్ద'  కావాలి… అదీ  గొప్ప !
                                                     

                                                         - మధు ( 01.01.2014)


Friday, October 18, 2013

Money..Money...More Money :(

'పైసా'కి విలువ లేదు.
రూపాయికీ విలువ లేదు..
వందకీ విలువే లేదు.

బంధానికి విలువ లేదు.
బంధుత్వానికీ విలువ లేదు..
భారతీయత లేనే లేదు...

మనిషికి విలువ లేదు.
మనసుకీ విలువ లేదు..
మానవీయ విలువలే లేవు...

విలువలకు నీళ్ళు వదిలి ఏళ్ళు గడిచాయి.
స్వార్ధపు రక్కసులు నోళ్ళు తెరిచాయి..

                                                           -మధు

Sunday, May 12, 2013

మ్మ...
కలేసినపుడు  గుర్తొచ్చేది  అమ్మ.
సుమంతైనా  స్వార్థం  లేక,
జీవితమంతా నీ కోసం పాటుపడేది  అమ్మ. 
బలాటం  అమ్మకి, 
రంతా  నీ పేరు  గొప్పగా చెప్పుకోవాలని. 
oదరిలో  ఉన్నా..
దేశంలో  నువ్వున్నా...
రావతమే  అధిరోహించినా...
oటరివే  అమ్మ లేకుంటే. 
నమాలు  నీతో దిద్దించి, 
రా ! అనిపించేలా  నీ భవిష్యత్తుండాలని తపించేది  అమ్మ. 
అందమైన  తోడును  నీకోసం వెతికి, 
ఆఃహా ! అనిపించేలా నీ జీవితం  సాగాలని  కాంక్షించేది  అమ్మ. 


అమ్మలందరికీ.. మాతృ దినోత్సవ  శుభాకాంక్షలు :)
                                                           

                                                                   - మధు