Tuesday, December 31, 2013

'జీవితం' vs 'గొప్ప జీవితం'

గిన్నెడు  గోరుముద్దలు.. గడికిన్ని  ముద్దులు. 
చారెడు  బలపాలు.. బోలెడు  అల్లర్లు.
సంచెడు  పుస్తకాలు.. బండెడు  జ్ఞాపకాలు.
మూడు  ముళ్ళు.. ఏడు  అడుగులు...  
గుప్పెడు  అక్షతలు.. దోసెడు  తలంబ్రాలు. 
ఆకాశమంత  ఆశలు.. నక్షత్రాలన్ని  కోరికలు.
అంతులేని  అనుభూతులు.. అపుడపుడు  జాలువారే ఆనంద బాష్పాలు. 
వేలల్లో  తెలిసిన వాళ్ళు.. వేళ్ళమీద  లెక్కపెట్టుకునేంత మంది  ఆప్తులు. 
కడివెడు  కన్నీళ్ళు.. కొండంత  సంతోషాలు.
ఆఖరికి, 
ఆరడుగుల  నేల.. పిడికెడు  మట్టి.
జీవితంలో  అన్నింటికి  కొలతలున్నాయి.. అది  కాదు  గొప్ప.
మన జీవితమే  ఒక  'కొలబద్ద'  కావాలి… అదీ  గొప్ప !
                                                     

                                                         - మధు ( 01.01.2014)


No comments:

Post a Comment