# పది
అమ్మ ఎపుడూ చెప్తూ ఉండేది..
'మంచోడ్ని పది ఇచ్చి కొనుక్కో,
చెడ్డోడ్ని పది ఇచ్చి వదిలించుకో నాన్నా' అని....
ఇప్పటికి ఎన్నో పదులు వాడాను.
ఏ పది దేనికి వాడానన్నదే అర్ధమయ్యి సావట్లేదు..
నా దగ్గర ఇంకా చాలా పదులున్నాయి..
వాటిని వాడాలా ? వద్దా !?
- మధు
సెప్టెంబర్ 2, 2016
No comments:
Post a Comment