రక్తమాంసాలున్న రోబోలం ! |
ఎవరో అరువిచ్చిన Artifical Intelligance ని వాడడమే తప్ప.. |
సొంతంగా ఆలోచించడం
మానేసిన మనుషులం... |
ఎవరైనా రండి …! |
మా neural schema ని మార్చి మమ్ముద్దరించండి.. |
మనిషికి , machine కి తేడా చూడగలిగే లోకానికి దారి చూపండి.. |
ఈ materialistic world లో humanity కీ కాస్తంత చోటుందని నిరూపించండి... |
ఎవరైనా ముందుకు రండి …! |
- మధు March 25, 2015 |
Monday, May 8, 2017
రోబోసేపియన్స్
నేను
కోపమొస్తుంది.. |
నన్నెవరో నా నుండి లాగేయాలని చూస్తున్నపుడు... |
భయమేస్తుంది.. |
నన్ను నేను కోల్పోతానేమో అని అనుమానమొచ్చినపుడు... |
బాదేస్తుంది.. |
నన్ను నేను పోగొట్టుకున్నపుడు... |
ఆశ్చర్యమేస్తుంది.. |
నాలో నేను లేనని తెలిసినపుడు... |
ఆరాటంగా ఉంటుంది.. |
నన్ను నేను తిరిగి పొందాలనుకున్నపుడు... |
ఆనందమేస్తుంది.. |
నాకు నేను దొరికినపుడు... |
గర్వంగా ఉంటుంది.. |
నన్ను నేను గెలుపొందినపుడు... |
నవ్వొస్తుంది... |
నేను అనేది ఒక 'మిధ్య' అని తెలిసినపుడు :O |
- మధు Jan 2, 2015 |
Sunday, May 7, 2017
My valentine in imagination.. #ఆమె#
శిశిరం దాటిన వసంతంలా...
వసంతంలో చిగురించిన కొమ్మలా...
కొమ్మ ఊగినపుడు వీచిన పవనంలా...పవనపు చల్లదనానికి కరిగిన మేఘంలా...
మేఘం కరిగి కురిసిన వానలా...
వానలో తడిసిన భామలా...
భామ ముక్కుకున్న పుడకలా...
పుడక మెరిసిన మెరుపులా...
ఆ మెరుపులో కనిపించిన ఆమె మోములా...
మోముపై నర్తించే ముంగురులలా...
ముంగురులను సవరించే ముని వ్రేళ్ళలా...
వ్రేలికున్న ఉంగరంలా...
ఉంగరంలోని పగడంలా...
పగడపు కాంతి ప్రతిబింబించిన ఆమె పలువరుసలా...
పలువరుసను ముద్దాడుతున్న ఆమె పెదాలలా...
ఆ పెదాలు పలికే నా పేరులా...
ఎంత అందంగా ఉంది
- మధు
బ్రతుకు
బయలుదేరా బతుకుదెరువు కోసం..
బాదల బందీఖానా నుండి బయటపడటం కోసం...
బంధాలను కాలదన్ని పోయిన కరకు మనుషుల నుండి దూరంగా..
నన్ను నేను వెతుక్కుంటూ నాలోకి నన్ను జొప్పిస్తూ కదులుతున్నా భారంగా...
ఉన్న ఊరు ఖాళీ చేసి కొత్త ఊరికి వలసపోతున్నా..
మరి ఖాళీ ఐన మనసు గతి ఏమిటన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తున్నా...
- మధు
Feb 4, 2017
బాదల బందీఖానా నుండి బయటపడటం కోసం...
బంధాలను కాలదన్ని పోయిన కరకు మనుషుల నుండి దూరంగా..
నన్ను నేను వెతుక్కుంటూ నాలోకి నన్ను జొప్పిస్తూ కదులుతున్నా భారంగా...
ఉన్న ఊరు ఖాళీ చేసి కొత్త ఊరికి వలసపోతున్నా..
మరి ఖాళీ ఐన మనసు గతి ఏమిటన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తున్నా...
- మధు
Feb 4, 2017
Subscribe to:
Posts (Atom)