అమ్మ గుర్తొచ్చినపుడు... |
ఆకలేసినపుడు... |
ఆందోళనగా ఉన్నప్పుడు... |
ఆవేదనకు లోనైనపుడు... |
ఆవేశం కట్టలు తెంచుకున్నపుడు... |
ఆత్మస్థైర్యం కూడదీసుకున్నప్పుడు... |
*** |
బాధింపబడినపుడు… |
భరించలేనపుడు... |
బాధను బదలాయించాలనుకున్నప్పుడు… |
బతుకు భారమైనపుడు… |
బతకనేర్చడానికి దారులు వెతుకుతున్నపుడు… |
బంధాల బందిఖానా తలుపులు బద్దలు కొడుతున్నప్పుడు... |
*** |
వ్యంగాస్త్రాలు సంధించాలనుకున్నపుడు… |
వ్యాకరణం గుర్తొచ్చినపుడు… |
వ్యామోహం కవిత పట్ల పెరిగిపొయినప్పుడు… |
వ్యాకులతకు గురైనపుడు... |
వ్యాఘ్రమై మది ప్రజ్వరిల్లినపుడు… |
వ్యాకోచ సంకోచాలతో గుండె తల్లడిల్లినప్పుడు… |
*** |
రాకాసి మూకలు రక్కుతున్నపుడు … |
రక్తం ఏరులై పారినపుడు… |
రాలిన చుక్కలను లెక్కపెడుతున్నప్పుడు… |
రవి ఉదయించిపుడు... |
రంధ్రాన్వేషణ జరుగుతున్నపుడు... |
రాజకీయం రాక్షసమై రాజ్యమేలుతున్నప్పుడు... |
*** |
మబ్బు పట్టినపుడు... |
మసక చీకట్లు కమ్మినపుడు... |
మల్లెలు గుభాలించినప్పుడు... |
మదిలో కోరిక రగిలినపుడు... |
మనసు విరిగినపుడు... |
మరో ప్రపంచపు దారులు వెతికేటప్పుడు... |
*** |
ప్రకృతిని చూసి పరవశించినపుడు... |
ప్రశ్నించాలనుకున్నపుడు... |
ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు... |
ప్రయాణంలో ఆటంకాలెదురైనపుడు... |
ప్రాణం కొట్టుమిట్టాడుతున్నపుడు... |
ప్రాయోపవేశం కోసం పాకులాడుతున్నప్పుడు... |
*** |
కలలో కాంత కనిపించినపుడు… |
కన్నె పిల్ల కన్ను గీటినపుడు… |
కంఠ స్వరం గధ్గదమైనప్పుడు... |
కదన కుతూహలంతో కత్తుల కోలాటం జరుగుతున్నపుడు… |
కుత్తుకలు తెగిపడి కరాళ నృత్యం చేస్తున్నపుడు… |
కొత్తగా ఖడ్గ సృష్టి జరుగుతున్నప్పుడు… |
*** |
పుట్టినపుడు… |
పుడమి మట్టిలో కలిసినపుడు… |
పున్నామ నరకానికి చేరువౌతున్నప్పుడు… |
పులకరించినపుడు... |
పుట్టవాదాలను రట్టు చేసినపుడు... |
పుక్కిటి పురాణాలను పెకలించినప్పుడు... |
*** |
అపుడు, ఇపుడు అని కాదు.. ఎప్పుడూ… |
తోడుండేది కవిత ఒక్కటే… |
బాధల్లోనూ భావుకత వెతుక్కునేది కవి ఒక్కడే… |
- మధు |
(నాలో నేను మథనపడుతూ.. నా కోసం నేను రాసుకుంటూనే ఉంటా !) Feb 24, 2015 |
Friday, March 27, 2015
కవి'త
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... 2014
ఆకలేసినపుడు గుర్తొచ్చేది అమ్మేగా..
తప్పు చేసినపుడు కేకలేసేదీ అమ్మేగా...
బూచోడొస్తాడని భయపెట్టింది అమ్మేగా..
బూరెలు వండిపెట్టిందీ అమ్మేగా...
కథ చెప్పి నిద్ర పుచ్చింది అమ్మేగా..
నువ్వు చెప్పే కథలన్నీ విని నమ్మేదీ అమ్మేగా…
నడక నేర్చినపుడు వేలు పట్టింది అమ్మేగా..
నడత మారినపుడు చెవి మెలిపెట్టిందీ అమ్మేగా…
నువ్వు కలతలో ఉంటే కన్నీరు పెట్టింది అమ్మేగా..
నీకు నలతగా ఉన్నపుడు యాతన పడిందీ అమ్మేగా…
మొండిగా నువ్వుంటే.. మొట్టికాయ వేసింది అమ్మేగా..
పట్టుదలతో పనిచేస్తే.. వెన్ను తట్టిందీ అమ్మేగా…
అందుకే నేనంటాను...
'అమ్మ'
అని చదవగలం కానీ,
అమ్మని చదవగలమా ?
-మధు
మాతృ
దినోత్సవ శుభాకాంక్షలు...
Happy Mother's Day to all..
—
May
11th, 2014
ఆకలేసినపుడు గుర్తొచ్చేది అమ్మేగా..
|
|
తప్పు చేసినపుడు కేకలేసేదీ అమ్మేగా... | |
బూచోడొస్తాడని భయపెట్టింది అమ్మేగా.. | |
బూరెలు వండిపెట్టిందీ అమ్మేగా... | |
కథ చెప్పి నిద్ర పుచ్చింది అమ్మేగా.. | |
|
|
నడత మారినపుడు చెవి మెలిపెట్టిందీ అమ్మేగా… | |
నువ్వు కలతలో ఉంటే కన్నీరు పెట్టింది అమ్మేగా.. | |
నీకు నలతగా ఉన్నపుడు యాతన పడిందీ అమ్మేగా… | |
మొండిగా నువ్వుంటే.. మొట్టికాయ వేసింది అమ్మేగా.. | |
పట్టుదలతో పనిచేస్తే.. వెన్ను తట్టిందీ అమ్మేగా… | |
అందుకే నేనంటాను... | |
'అమ్మ' అని చదవగలం కానీ, | |
అమ్మని చదవగలమా ? | |
-మధు | |
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... | |
Happy Mother's Day to all.. | |
— | |
|
Subscribe to:
Posts (Atom)