Tuesday, November 27, 2012


నీ  జ్ఞాపకాలన్నీ ఇంకా  తాజాగానే  ఉన్నాయి... 
 నా  తడి  కన్నుల్లో...

నీ  నీడ  ఎపుడూ మెదులుతూనే  ఉంటుంది...
 నా  కనుసన్నల్లో...
                                                                          -మధు ( Nov 2010)


Thursday, November 22, 2012


క్షణాలు, నిమిషాలు, గంటలు...
పూటలు, రోజులు, వారాలు...
పక్షాలు, మాసాలు, సంవత్సరాలు...
గడిచిపోతూనే  ఉన్నాయ్..!

ఎన్నటికీ  మారని  మనుషుల్లో  మార్పు  కోరే కన్నా.. 
మన కోసం  మారని  మనుషుల కోసం  మారే కన్నా...
మనం  మనలాగే ఉండాలని  తెలుసుకునేదెన్నడో..? 
                                                                               
                                                                           - మధు (2011)


Thursday, November 8, 2012


నువ్వే నేనని అనుకున్నాను.. 
నా వెంటే నువ్వుంటావని కలగన్నాను. 

నీ తోటిదే లోకం అనుకున్నాను..
నా తోడై నువ్వుంటావని భ్రమ పడ్డాను. 

తెలిసింది (కాస్త ఆలస్యంగా...) !

కలలన్నీ నిజాలు కావని..
భ్రమలన్నీ అబద్దాలేననీ...   

- మధు (2010) 

Monday, November 5, 2012

నేనావిరై మేఘమవనా..  
                    చిరుజల్లునై నీపై కురవగా...

నే సూర్యుడై వెలగనా..                
                    నునువెచ్చని కిరణమై నిను సోకగా...

నే కొమ్మనై ఊగనా..
                     చిరుపవనమై నిను స్పృశించగా...

నే పూవునై విరియనా..
                     సుమగంధమై నువు గ్రోలగా...

నే వీణనై మ్రోగనా..                   
                      మృదు రాగమై నీకే వినిపించగా...

నే మువ్వగా మారనా..          
                      నీ కాలి అందియలో చేరి ఘల్లుమనగా...

                                                            -మధు (2003)

Thursday, November 1, 2012

అశ్రు మేఘం

నా కనులు మేఘాలై.. కన్నీటిని వర్షించినా...
కరగలేదు చెలి హృదయం..
ఐనా.. నా మదిలోని తన తలపుకు లేదు మరణం... 


                                                            -మధు (2010)

Wednesday, September 12, 2012

From Dream to Reality

మేఘమై తను వస్తానంది.. వానై నా పై కురుస్తానంది...
మెరుపై తను మెరుస్తానంది.. వెలుగై నా పై ప్రసరిస్తానంది...
పాటగా తను వినిపిస్తానంది.. కమ్మని రాగమై నాకు వీనుల విందు చేస్తానంది...
పువ్వై తను వికసిస్తానంది.. పరిమళమై నను మైమరపిస్తానంది...
దేవతగా తను కరుణిస్తానంది.. వరాల వెల్లువ లో నను ముంచేస్తానంది...
.
.
.
.
.
.

.
.
అమ్మ పిలిచింది.. కాదు అరిచింది...!
(ఆఫీస్ కి టైం అయింది. లేవరా....)
.
.
.
.
.
.
.
కళ్ళు తెరిచి చూస్తే.. అప్పుడే తెల్లారింది... :-(  - మధు