Tuesday, January 28, 2014
:: ఎవరు నేను ::
రేపు గొప్పగా ఉండాలని ఆరాటపడతాను. |
నేనొక
స్వాప్నికుణ్ణి..
|
అందుకోసం
నిరంతరం పోరాడతాను.
|
నేనొక
శ్రామికుణ్ణి..
|
నాలో నేను
మధనపడతాను.
|
నేనొక
అంతర్ముఖుణ్ణి..
|
అంతా మంచే
జరుగుతుందనుకుంటాను.
|
నేనొక
ఆశావహుణ్ణి..
|
నచ్చకపోతే
నిక్కచ్చిగా నా అభిప్రాయం చెప్తాను.
|
నేనొక
విమర్శకుణ్ణి..
|
అవసరమైతే
తిరుగుబాటు బావుటా ఎగరేస్తాను.
|
నేనొక
విప్లవకారుణ్ణి..
|
నేను
'మనుషుల్ని' గౌరవిస్తాను.
|
నేనొక
మానవతావాదిని..
|
నన్ను నేను
అభిమానించుకుంటాను.
|
నేనొక
మానాభిమానిని..
|
హితుల్ని
ప్రోత్సహిస్తాను.
|
నేనొక
ప్రేరకుణ్ణి..
|
స్నేహితుల్ని
ప్రేమిస్తాను.
|
నేనొక
ప్రేమికుణ్ణి..
|
ఒక్కోసారి
బంధాలను వదిలేద్దామనుకుంటాను.
|
నేనొక
తాపసిని..
|
అవే బంధాల
కోసం ఏదైనా చేద్దామనుకుంటాను.
|
నేనొక
తపస్విని..
|
అందరిని
కలుస్తూ ఉంటాను.
|
నేనొక
దేశదిమ్మరిని..
|
అందరిని
కలుపుకోవాలనుకుంటాను.
|
నేనొక
దేవుణ్ణి..
|
కొత్తంగా
చెప్పడానికేమీ లేదు..
|
మొత్తంగా
నేనొక 'మనిషి'ని...
|
- మధు (04.11.2013)
|
Monday, January 6, 2014
బ్రతికుంటే..
చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. చావడానికి నిన్ను ఉసిగొల్పిన అంశం అంతు చూసే అవకాశమొస్తది.
చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. నిన్ను తక్కువ చేసి మాట్లాడినోళ్ళకి నీ తఢాఖా చూపించే రోజొస్తది.
చస్తే ఏమొస్తది ?
బ్రతికుంటే.. నిన్ను అణగదొక్కాలనుకున్న వాళ్ళకి నీ ఉన్నతిని చూపే సమయమొస్తది.
చస్తే ఏమొస్తదిరా ?
బ్రతికుంటే.. చావాలన్న ఆలోచనని కూడా చంపే ధైర్యమొస్తది.
- మధు :(
Subscribe to:
Posts (Atom)