అమ్మ...
ఆకలేసినపుడు గుర్తొచ్చేది అమ్మ.
ఇసుమంతైనా స్వార్థం లేక,
ఈ జీవితమంతా నీ కోసం పాటుపడేది అమ్మ.
ఉబలాటం అమ్మకి,
ఊరంతా నీ పేరు గొప్పగా చెప్పుకోవాలని.
ఎoదరిలో ఉన్నా..
ఏ దేశంలో నువ్వున్నా...
ఐరావతమే అధిరోహించినా...
ఒoటరివే అమ్మ లేకుంటే.
ఓనమాలు నీతో దిద్దించి,
ఔరా ! అనిపించేలా నీ భవిష్యత్తుండాలని తపించేది అమ్మ.
అందమైన తోడును నీకోసం వెతికి,
ఆఃహా ! అనిపించేలా నీ జీవితం సాగాలని కాంక్షించేది అమ్మ.
అమ్మలందరికీ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :)
- మధు